ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో టి డి పి పార్టీ భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి డి పి పార్టీకి పెద్ద స్థాయిలో అసెంబ్లీ స్థానాలు రాలేదు. ఆ సంవత్సరం వై సీ పీ పార్టీకి పెద్ద మొత్తంలో అసెంబ్లీ స్థానాలు రావడంతో వై సి పి పార్టీ 2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

దానితో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఎన్నికయ్యారు. జగన్ ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చాడో అవన్నీ పూర్తి చేస్తూ వచ్చాడు. దానితో జనాలు కూడా ఈయనపై చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కానీ జగన్ అలాంటి సమయం లోనే ఓ తప్పు చేశాడు అనే అభిప్రాయాలను జనాలు వినిపించారు. అది ఏమిటి అంటే ... లోకల్ ఎలక్షన్లలో తమ పార్టీ కార్యకర్తలను ఎలాంటి పోటీ లేకుండా గెలిపించడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు అని , ఆ ప్రయత్నాల కారణంగా అనేక ప్రాంతాలలో పోటీనే లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు గెలవడం వల్ల ప్రజల్లో జగన్ వై సి పి పార్టీపై నెగెటివిటీ స్టార్ట్ అయింది.

టి డి పి పార్టీ వారికి అప్పటి వరకు జనాల్లో పెద్దగా పాజిటివ్ లేకపోయినా వీరు ఇలా ప్రవర్తించడం వల్ల టీ డీ పీ పార్టీపై ప్రజల్లో పాజిటివ్ నేస్ పెరిగింది. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి డి పి పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇక వీరు కూడా జగన్ ఆ సమయంలో అవలంబించిన పందానే అవలంబిస్తున్నారు అని అభిప్రాయాలు జనాల నుండి వస్తున్నాయి. దానితో ఇది టి డి పి పార్టీకి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్త పరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: