
వేగంగా సినిమాలలో నటించకపోవడం పవన్ కళ్యాణ్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా మైనస్ అవుతోంది. మరో స్టార్ హీరో ప్రభాస్ పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ఎదురుదెబ్బలు తిన్నారు. ప్రస్తుతం కూడా ప్రభాస్ అదే తరహా తప్పు చేస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు వేగంగా సినిమాల్లో నటించిన తారక్ ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు.
తారక్ కెరీర్ పీక్స్ లో ఉన్న తరుణంలో ఇలా మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం విషయంలో అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో హీరో చరణ్ కథల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల ఫలితాలు రామ్ చరణ్ అభిమానులను తీవ్రంగా ప్రభావం చూపాయి. గత ఏడేళ్లలో రామ్ చరణ్ కెరీర్ లో ఆర్.ఆర్.ఆర్ మాత్రమే హిట్ గా నిలిచింది.
మరో స్టార్ హీరో మహేష్ బాబు రాజమౌళి సినిమాకే మూడు నుంచి నాలుగేళ్ల సమయం కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో స్టార్ హీరో బన్నీ సైతం నత్తనడకన సినిమాల్లో నటిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల ప్లానింగ్ ఒకింత గందరగోళంగా ఉందని చెప్పవచ్చు. ఈ విషయంలో స్టార్స్ మారతారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా మాయలో పడి ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తున్నారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.