- కూట‌మి ప్ర‌భుత్వం కొమ్ము కాసే అధికారుల‌ను విడిచిపెట్ట‌ను
- వంశీ ఏ త‌ప్పు చేయ‌లేదు .. జ‌గ‌న్ వార్నింగ్‌

- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .

గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసు విషయంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలులో పరామర్శించారు. వంశీ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగన్ పార్టీ పరంగా ఎప్పుడు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోని అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ ఎటువంటి తప్పు చేయలేదని ఫిర్యాదు దారుడే చెప్పిన ఆయనను మంగళగిరి పిలిపించుకుని బెదిరించి మరో ఫిర్యాదు చేయించారని జగన్ ఆరోపించారు. టిడిపి కార్యాలయం తగలబడింది లేదు . . ఆ కార్యాలయం ఎస్సీ - ఎస్టీలకు సంబంధించింది కాదు అయినా బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసు పెట్టించారని జగన్ మండిపడ్డారు . . కొందరు అధికారులు టిడిపి నేతలకు సెల్యూట్ చేస్తూ వారు చెప్పినట్లు చేస్తున్నారని .. రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తే అన్యాయం చేసిన అధికారులు నాయకులు అందరిని బట్టలు ఊడదీసి నిలబెడతామని వారు రిటైర్ అయిన ... సప్త సముద్రాల అవతల ఉన్న న్యాయస్థానాల ముందు నిలబెడతామంటూ జగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.


చంద్రబాబు సామాజిక వర్గంలో ఆయన తప్ప ఎవరూ ఎదగకుండా ఉండాలని కారణంతో ఆ సామాజిక వర్గం నుంచి వెలివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏదో ఒక రోజు కొడాలి నాని - దేవినేని అవినాష్ కు కూడా ఇబ్బందులు పెడతారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు లోకేష్ కన్నా అందంగా ఉంటాడని భవిష్యత్తులో అవినాష్ టార్గెట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని జగన్ సెటైరికల్ గా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: