
2025-2026 సంవత్సరానికి గాను రైతులకు డ్రిప్ మరియు స్పిన్క్లర్లను సబ్సిడీగా అందించబోతున్నారు.. ఎస్సీ,ఎస్టీ లో ఉండేటువంటి చిన్న మధ్యతరహా రైతులకు సైతం 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి 100% డ్రిప్ రాయితీని ఇవ్వబోతున్నారట.. మిగిలిన చిన్న, మధ్య తరగతి రైతులకు సైతం 90 శాతం వరకు రాయితీ ఇవ్వబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మధ్య రైతులకు 50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నారట. స్పిన్క్లర్ల పైన అన్ని కేటగిరి రైతులకు కూడా 50% సబ్సిడీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ సబ్సిడీలో 27% నుంచి 33 శాతం వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని.. అలాగే 17 శాతం నుంచి 67% వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందంటూ తెలియజేస్తోంది. అలాగే రైతు సేవా కేంద్రాల వద్ద రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఈ పరికరాలను అందించేందుకు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చట. 2022లో వైసీపీ ప్రభుత్వంలో ప్రకటించినటువంటి ఈ పథకాన్ని.. గత ఐదేళ్లు నామమాత్రంగానే అమలు చేశారని కూటమి ప్రభుత్వం వెల్లడించింది.1150 కోట్ల మీద బకాయిలు అలాగే పెండింగ్ పెట్టారనే విధంగా కూటమి ప్రభుత్వం విమర్శిస్తోంది. తాము మాత్రం అలా చేయమని రైతులకు మేలు చేసే దిశగానే అడుగులు వేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం తెలుపుతోంది.