
వల్లభనేని వంశి మంగళగిరి టిడిపి కార్యాలయంలో కేసులో సాక్షులను కిడ్నాప్ చేశారని.. ఆ కిడ్నాప్ కారణంగా వంశీని అరెస్టు చేసామంటూ అధికారులు తెలిపారు.. కానీ ప్రజలు మాత్రం అలా అనుకోవట్లేదట.. అయితే ఈ విషయాన్ని వైసీపీ వాళ్లు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించలేదు.. ఎందుకంటే గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పారనే విధంగా వినిపించాయి.. అయితే అనవసరంగా కూటమి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఎందుకు అన్నట్లు చాలామంది ప్రశ్నిస్తున్నారు?.
ఇదిగో వంశీ కిడ్నాప్ చేశారు అంటూ పలు రకాల వీడియోలు చూపిస్తున్నారు.. ఇక సత్యవర్ధన్ కూడా చాలా చక్కగా అని నడిచి వస్తూ ఉన్నారు. వంశీ పక్కన వస్తున్నప్పుడు లిఫ్టులో కూడా ఉన్నారు.. అయితే కిడ్నాప్ అంటే ఏంటి హింసిస్తూ ఉంటారు. వారిని గట్టిగా పట్టుకునీ ,కొడతారు, హింసిస్తూ వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అలా కాకుండా సత్యవర్ధన్ విజువల్ చూస్తే అలాంటివి ఎక్కడా కూడా కనిపించలేదు.. అయితే వంశీ వాళ్లతో మాట్లాడారనీ.. మాట్లాడి విత్ డ్రా కేసును చేయించేలా చేసుకున్నారని టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. 40 లక్షల రూపాయలకు కాంప్రమైజ్ అయ్యారనే విధంగా మాట్లాడుకున్నారని విధంగా చాలామంది నేతలు తెలుపుతున్నారు.. కిడ్నాప్ అనేది కూడా కేవలం ఒక కథాంతంగా మారిపోయింది.. మొత్తానికి వల్లభనేని వంశీని లోపల వేయాలనుకున్నారు వేశారనే విధంగా మాట్లాడుకుంటున్నారు.