ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో చాలామంది ప్రజలే కాకుండా సినీ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు, పెద్దపెద్ద వారందరూ కూడా త్రివేణి సంఘంలో పవిత్రమైన స్నానాలు చేసేందుకు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ దీక్ష వ్యాప్తంగా పెరిగిపోయింది. నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఏర్పడినటువంటి ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు పోతాయని చాలామంది భక్తులు అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళ ఫిబ్రవరి 26 న ముగియబోతోందట.

ఇదంతా ఇలా ఉండగా ఇప్పటివరకు సుమారుగా 55 కోట్ల మంది అక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ గవర్నమెంట్ వెల్లడించింది. ముఖ్యంగా కుంభమేళాలోకి ప్రతిరోజు వచ్చే వారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని ఏమాత్రం తగ్గడం లేదని తెలుపుతున్నారు  ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా అక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నిటినీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. అయితే కోట్లల్లో వస్తున్న భక్తులు సరిపడు సదుపాయాలు మాత్రం ఇబ్బందులుగా మారుతున్నాయట. ముఖ్యంగా కుంభమేళాలో అమ్మాయిలు ,మహిళలు వచ్చి పుణ్య  స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు.


దీంతో కొంతమంది దుర్మార్గులు మహిళలు యువత సైతం స్నానం చేస్తూ బట్టలు మార్చుకుంటున్న సమయాలలో సీక్రెట్ గా వీడియోలు ఫోటోలను తీసి ఆన్లైన్లో పెడుతున్నారనే విషయాలు ఎప్పుడూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వీడియోలు ఫోటోలు చూడాలి అంటే డబ్బులు పంపించాలని కొన్ని లింకులను కూడా కొంతమంది కేటుగాళ్లు పెడుతున్నారట. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో కుంభమేళాకు వచ్చే భక్తులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారట ఇలాంటి వాటిని కట్టడి చేసి దారుణంగా శిక్షించాలని విధంగా చాలామంది డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటిపైన అక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా పోస్టులు పెట్టిన దుండగుల కోసం కూడా తీవ్రమైన గాలింపు చేస్తున్నారట పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: