
మాజీ సీఎం జగన్ తో పాటుగా వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పర్యటించారని.. కొడాలి నాని, అంబాటి రాంబాబు, నందిగామ సురేష్, పిన్నెల్లి, అప్పిరెడ్డి తదితర వారిపైన పోలీస్ కేసు నమోదు చేశారట. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయని అలాగే రోడ్డుమీద వైసిపి నేతలు కార్యకర్తలు వాహనాలు కూడా నిలపవేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారనే విధంగా రేపు ప్రభుత్వం వెల్లడిస్తోంది.
ముఖ్యంగా మిర్చి యార్డులో సరుకు తెచ్చే వాహనాలతో పాటుగా అటు అమ్మకానికి వచ్చిన రైతులు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి అనే విధంగా తెలిపారు.. దీంతో మిర్చి లోడ్ కు వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా రోడ్డు మీదే నిలిచిపోవడంతో పోలీసు కేసు నమోదు అయినట్లుగా తెలుస్తున్నది.నిన్నటి రోజున జగన్ గుంటూరు మిర్చి యార్డు వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం పైన చాలా విమర్శలు కూడా చేశారు. గిట్టుబాటు ధర కల్పించలేదంటూ కూడా ప్రభుత్వం పైన ఫైర్ కావడం జరిగింది. రైతులు కష్టపడి పండించిన ఈ పంటను అమ్ముకోలేని పరిస్థితులలో ఉన్నారని తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయాల పైన అటు టిడిపి నేతలు కూడా కౌంటర్లు వేస్తూ ఉన్నప్పటికీ పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.. కేవలం వైయస్ జగన్ కి సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.