మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కూడా హోదా లేదనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కనీసం 10 శాతం స్థానాల్లో విజయం సాధించే విషయంలో వైసీపీ ఫెయిలైంది. కూటమి తరపున పోటీ చేసిన బీజేపీ సైతం సునాయాసంగా 70 శాతం స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. జగన్ తాజాగా గుంటూరు మిర్చి యార్డ్ కు వెళ్లి అక్కడ మిర్చి రైతులు అనుభవిస్తున్న కష్టాలను తెలుసుకున్నారు.
 
ఏపీలో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతుల కష్టాలు బాబుకు కనపడుతున్నా ఆయన కళ్లు మూసుకుని కూర్చున్నారంటూ జగన్ విమర్శలు చేశారు. కూటమి పాలనలో ఏ రైతు కూడా సంతోషంగా లేడని ఈ క్రాప్ ను గాలికి వదిలేశారని ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు సున్నా వడ్డీ రాయితీలు అందడం లేదని జగన్ బాబు సర్కార్ పై ఒకింత తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.
 
మిర్చి రైతుల బాధలను తెలుసుకుని జగన్ చలించిపోవడంతో పాటు ఏ పంట చూసినా మద్దతు కరువు అయిందని పేర్కొన్నారు. మిర్చి రైతులకు పెట్టుబడులు భారీ స్థాయిలో పెరుగుతుండగా ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కూటమి నేతలు జగన్ కు అంత సీన్ లేదని చెబుతూనే జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
 
జగన్ పై కొత్తగా కొన్ని కేసులు కూడా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు మాత్రమే వస్తుందని కొందరు టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడం కూటమికి మేలు చేస్తుందో లేదా నెగిటివ్ చేస్తుందో చూడాల్సి ఉంది. జగన్ భవిష్యత్తుపై ఫుల్ ఫోకస్ తో ఉన్నారని తెలుస్తోంది. జగన్ కు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం మైనస్ అవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: