తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన యుద్ధానికి దిగబోతున్నారు కేసీఆర్. దాదాపు 16 నెలల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. ఇక తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్ళనున్నారు. ఏప్రిల్ నెల నుంచి.. జనాల్లో ఉండబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.  గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న నేపథ్యంలో... భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.

అయితే దానికంటే ముందు ఏప్రిల్ మాసంలో... ఏకంగా ఐదు సభలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. జనగామ, కామారెడ్డి, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.  ఒక్కో సభలో కనీసం రెండు నుంచి మూడు లక్షల జనాభా వచ్చేలా... ప్లాన్ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాలాగే దక్షిణ జిల్లాలను కవర్ చేసేలా... కెసిఆర్ ప్లాన్ వేస్తున్నారు.

 ఇక నిన్న... గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్... కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గులాబీ పార్టీ నేతలతో... సమావేశం నిర్వహించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలపై... భారీ ప్లాన్ చేశారు కేసీఆర్.

 పార్టీ ముఖ్య నేతల.... సలహాలను అలాగే సూచనలను.. తెలుసుకున్నారు. వాళ్ల అభిప్రాయం మేరకు కాస్త ముందుకు అడుగులు వేసే దిశగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా కొంత మంది గులాబీ పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు కేసీఆర్. అదే సమయంలో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు రాబోతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలవాలని... ప్లాన్ చేస్తున్నారు.  ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైన కోర్టు తీర్పు ఇస్తే.. కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: