
విద్యా నాయకురాలుగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన రేఖా గుప్తా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనేదట. ముఖ్యంగా పార్కుల అభివృద్ధి కి చాలా కృషి చేసేదట రాజకీయంగా కూడా సుదీర్ఘ అనుభవం ఉండడంతో ఆమె ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయకపోయినా ఢిల్లీ మేయర్ గా పని చేసిందట. వీటికి తోడు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రెసిడెంట్ గా కూడా రెండుసార్లు ఎంపిక కావడం జరిగిందట. రేఖా గుప్తా సీఎంగా ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఆమె కుటుంబానికి సంఘ నేపథ్యం ఉండడం వల్లే బాగా కలిసి వచ్చింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చాలా చురుకైన పాత్ర పోషించిన తర్వాతే ఈమె బీజేపీ పార్టీలో చేరిందట. రేఖా గుప్తా వయసు ఇప్పుడు 50 ఏళ్లు. ఈమె తండ్రి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫీసులో పనిచేశారట. రేఖా గుప్తా విద్యాభ్యాసం ఎల్.ఎల్.బి పూర్తి చేసింది. చదువు పూర్తి అయిన తర్వాత..2003-04 బిజెపి యువ మోర్చా ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా కూడా పని చేసిందట. ఈ రోజున సీఎంగా ఇమే ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఈ వేడుక మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని సమాచారం.