
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ గడువు దగ్గర పడుతోంది. అయితే.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిమీద కూటమిలో ని పార్టీల మధ్య ఐక్యత అయితే కనిపించడం లేదు. ఈ విషయంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీలు ఇద్దరు బరిలో ఉంటే.. సిట్టింగ్ ఎమ్మెల్సీకి మరో ఛాన్స్ ఇచ్చి గెలిపించుకోవాలని అధికార కూటమి లో ఉన్న టిడిపి చూస్తోంది. ఈ క్రమంలోని రఘువర్మ కి మా మద్దతు అని టిడిపి స్పష్టం చేసింది. టిడిపికి 2023 పట్టభద్రలో ఎన్నికల విషయంలో రఘువర్మ మద్దతు ఇచ్చారన్న కారణంతో ఆయనకే తమ సపోర్ట్ అని టిడిపి నాయకులు చెబుతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో స్థానిక టిడిపి అభిప్రాయాలను తీసుకుని .. అధినాయకత్వం తన నిర్ణయం ప్రకటించింది. రఘువర్మను గెలిపించుకుంటే తమ బలం శాసన మండలిలో పెరుగుతుందని భావిస్తుంది. ఇక బిజెపి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇస్తుంది.
ఆయన గతంలో ఆరేళ్ల పాటు బాగా పనిచేశారు. బిజెపి మద్దతు ఆయనకు ప్రకటించిన నేపథ్యం లో.. టిడిపి రఘువర్మ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఇప్పుడు కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఎవరికి వారే.. యమునా తీరే .. అన్నట్టుగా ఉన్నారు. బిజెపి గాదె కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో .. వెనక్కు వస్తుందని అనుకోలేము. ఇక జనసేన ఎవరికి మద్దతు ఇస్తుందో ? చూడాలి. ఇక వామపక్షాల నుంచి విజయ గౌరీ పోటీలో ఉన్నారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రఘువర్మ , గాదె శ్రీనివాసులు నాయుడు ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందినవారు కావడంతో . . ఎవరు గెలిచిన ఆ జిల్లా నుంచి శాసనమండలలో ఎమ్మెల్సీగా అడుగుపెడతారు.