- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .

కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే .. వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ కు తాజాగా ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అండ చూసుకొని వంశీ చేసిన పనిలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో సత్య వర్ధన్ అనే వ్యక్తిని బెదిరించిన నేపథ్యం .. తదితర అంశాల నేపథ్యంలో వంశీని పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే .. వంశీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే వంశీని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైతం జైలుకు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పారు. తాజా గా బుధవారం వంశీ కేసు విషయంలో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటీషన్ హైకోర్టు ధర్మసనం కొట్టివేసింది.


ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని కూడా న్యాయస్థానం సూచించింది. ముందు నుంచి వంశీ ఈ కేసులో తనను ఎవరు ఏమీ చేయలేరని ... తనకు ఏమీ కాదన్నా అతి ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే వంశీని అరెస్టు చేశారో ? ఆ తర్వాత జైలుకు వెళ్లాల్సి వచ్చిందో అప్పటినుంచి వంశీ ధైర్యం సడలుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు బెయిల్ పిటిష‌న్ కొట్టి వేయడంతో ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇక వంశీ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎస్సీ - ఎస్టీ కోర్టును ఆశ్రయించ‌డం మాత్రమే. మరి అక్కడ అయినా వంశీకి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: