ఎన్డీఏ రూపంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో కీలకం అవుతారని కేసిఆర్ తన పార్టీ  విస్తృత కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్టుగా  బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి .. అయితే కేసీఆర్ పూర్తిగా పొలిటికల్ అప్డేట్స్ ఫాలో అవటం మర్చిపోయారో .. లేకపోతే గుడ్డిగా చంద్రబాబును టార్గెట్ చేసే తన పార్టీకి మళ్ళీ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు .. అనేది చాలామందికి అర్థం అవడం లేదు .. ఎందుకంటే ఎన్డీఏ ఏపీలో ఉంది కానీ తెలంగాణలో ఉందని ఎవరు క్లారిటీ ఇవ్వటం లేదు .
 

ప్రజెంట్ తెలంగాణలో బిజెపి ఒంటరిగానే అధికార , ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కుంటుంది .. తమకు ఏ పార్టీతో కూడా పొత్తులు లేవని ఆ పార్టీని నేత‌లు కూడా ప్రకటిస్తున్నారు .. టిడిపి ఎప్పుడు తెలంగాణ బిజెపితో కలిసి కార్యక్రమాలు ఎక్కడ చేపట్లేదు . అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి పనిచేసిన తర్వాత జనసేన కూడా బిజెపితో కలిసి కనిపించలేదు . మరి ఇలాంటి క్రమంలో ఎన్డీఏ ఎక్కడ ఉంది ? చంద్రబాబు సొంతంగా టిడిపిని బలోపేతం చేయాలని సన్నాహాలు చేస్తున్నారని .. వాటికోసం ప్రశాంత్ కిషోర్ , రాబిన్ సింగ్ సలహాలు కూడా తీసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి .. ఇక దానికి కూడా ఒక అడుగు ముందుకు పడటం లేదు.

 

ఇక చంద్రబాబు తెలంగాణ టిడిపి అధ్యక్షుని కూడా ఇప్పటికీ నియమించలేదు .. పార్టీని అలా పక్కనపెట్టి వదిలేసారు పార్టీలో చేరుతామ‌ని వ‌చ్చిన‌న తీగల కృష్ణారెడ్డి వంటి వారికి కూడా ఇంకా కండవాలు కప్పి లోపలికి తీసుకోలేదు .. తెలంగాణలో ఆయన వ్యూహం ఏమిటో తెలియదు .. అయితే ఎన్డీఏను తెలంగాణలో అధికారలోకి తీసుకువచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోబోతున్నారని కేసీఆర్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ .. తెలంగాణకు చంద్రబాబు వస్తున్నారని కామెంట్లు మాత్రం చేస్తున్నారు .. చంద్రబాబు ను బూచిగా  చూపించి అరిగిపోయిన పాత క్యాసెట్ ని కెసిఆర్ నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని మరి కొంతమంది ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: