ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే గతంలో ఎన్నికలలో రెండు చోట్ల నిలబడిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అయితే ఈసారి కూటమిల భాగంగా ఎంతో వ్యూహాత్మకంగానే పిఠాపురం నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకోవడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నేతలు కూడా ఆనందానికి అవధులు లేవు. అయితే అక్కడ పోటీకి సిద్ధమైన టిడిపి సీనియర్ నేత ఆయన వర్మ ఈ సీట్ ని త్యాగం చేశారు.


అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గెలిచాక అక్కడ సీను మొత్తం రివర్స్ అవుతున్నట్లుగా ఇప్పుడు కనిపిస్తున్నది. పిఠాపురం నియోజవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వర్మ పవన్ గెలుపులో చాలా కీలకంగా మారారు. అయితే ఆ తర్వాత వర్మ తనను పట్టించుకోలేదని అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదని తమ అనుచరులతో కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జనసేన కేడర్ తనకు దూరంగా ఉండటం వంటి అంశాలను కూడా వర్మాను బాధపెట్టాయట.


ఇప్పుడు తాజాగా వర్మ తన ట్విట్టర్ నుంచి ఒక పోస్టును షేర్ చేశారు. కష్టపడి సాధించిన విజయానికే ఎక్కువ గౌరవం అంటూ తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ తెలిపారు. ఇందులో ఒక వీడియోను కూడా జత చేయడం జరిగింది.ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను ఎంత కష్టపడ్డారనే విషయాలను కూడా చేర్పించారు. అయితే ఇందులో మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ ని చూపించలేదు. దీంతో పాటుగా ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ విజయం కోసం వర్మ కష్టపడినట్టుగా కనిపిస్తోందని అర్థం వచ్చేలా కనిపిస్తోంది. దీంతో వర్మ అభిమానులు ఈ పోస్టుకు మద్దతు తెలుపుతూ వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: