
- ఆఫీస్ డ్యాష్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) :
ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ సరికొత్త పంథా తో ముందుకు వెళుతున్నారు. కూటమి పార్టీల తరపున తెలుగుదేశం నుంచి పేరాబత్తుల రాజశేఖరం పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. . తన నియోజకవర్గం లో నాలుగు మండలాల్లోనూ పార్టీ నాయకులు చేస్తోన్న ప్రచారాన్ని తన ఆఫీస్‌లోని డ్యాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఆఫీస్‌లో తన ముందున్న స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు వివరాలు పర్యవేక్షిస్తూ నియోజకవర్గంలో ప్రతి గ్య్రాడ్యుయేట్ ఓటర్ ను పార్టీ కార్యకర్తలు కలిసి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించేందుకు పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తున్నారు. ఆఫీస్ నుంచే పార్టీ కీలక నేతలతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఎప్పటి కప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు మండలాల వారీగా పార్టీ నేతలతో ప్రత్యేకంగా కమిటీ లు కూడా ఏర్పాటు చేశారు ..
నియోజకవర్గంలో నాలుగు మండలాలలో బూత్ లెవెల్ ఇన్‌చార్జ్‌లు, సబ్ ఇన్‌చార్జ్‌లు.. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఓటర్‌ను ఎన్నిసార్లు కలుస్తున్నారు.. వారితో ఎమ్మెల్సీ అభ్యర్థి గురించి ఎలా ? వివరిస్తున్నారు అనే విషయాలు తన ఆఫీస్ స్క్రీన్ నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను కలుస్తున్న వారిని ప్రశంసిస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల లో టీడీపీ అభ్యర్థి గా కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనిపాడు మాజీ జడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారు. రాజశేఖరం గెలుపును టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.