
ఓటీపీ మోసాలు : ప్రస్తుతం ఏ లావాదేవీ జరగాలన్నా వన్ టైమ్ పాస్ వర్డ్ తప్పనిసరి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా లావాదేవీలు చేయాలంటే యూపీఐ పిన్ ను ఎంటర్ చేసి లావాదేవీలు నిర్వహించే ఛాన్స్ ఉండగా డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరపాలంటే వన్ టైమ్ పాస్ వర్డ్ తప్పనిసరి. అమాయక ప్రజల ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఏదో ఒక విధంగా ఓటీపీలు తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ కేవైసీ మోసాలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు కీలక పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. తాము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఈ కేవైసీ పూర్తి చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ లేదా బ్లాక్ అవుతుందని భయాందోళనకు గురి చేస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కేవైసీ మోసాలు తరచూ వెలుగులోకి వస్తున్నా ఈ తరహా మోసాలు ఆగడం లేదు.
సిమ్ స్వాప్ ఫ్రాడ్స్ : మోసాలు చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఒక కాల్ చేసుకుంటామని ఫోన్ తీసుకుని ఆ నంబర్ కాల్స్, మెసేజెస్ తమ నంబర్ కు ఫార్వర్డ్ అయ్యేలా చేసి సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతుండగా మరి కొందరు మోసగాళ్లు మనం ప్రస్తుతం వాడుతున్న నంబర్ డీ యాక్టివేట్ అయ్యేలా చేసి అదే నంబర్ తో కొత్త సిమ్ కార్డ్ ను యాక్టివేట్ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారు.