స్కీమ్స్ పేరుతో పర్ఫెక్ట్ స్కామ్స్ : ఖరీదైన ఫోన్లు, ల్యాప్ టాప్స్, ఇతర గ్యాడ్జెట్లను 80 నుంచి 90 శాతం డిస్కౌంట్ తో ఇస్తామని చెబుతూ డబ్బులు చెల్లించిన తర్వాత ఆ ప్రాడక్ట్ లను పంపించకపోవడం లేదా డూప్లికేట్ ఉత్పత్తులను పంపడం చేస్తూ కొన్ని ఫేక్ వెబ్ సైట్లు చదువుకున్న వాళ్లను మోసం చేస్తున్నాయి.
 
అధిక వడ్డీ పేరుతో ముంచుతున్న యాప్స్ : ఈ మధ్య కాలంలో చదువుకున్న యువతీ యువకులు ఈ తరహా యాప్స్ బారిన పడుతున్నారు. 1000 రూపాయలు చెల్లిస్తే వారం రోజుల్లో రెట్టింపు డబ్బులు ఇస్తామని ఎంత చెల్లిస్తే ఆ డబ్బులకు డబుల్ ఆదాయం పొందవచ్చని చెబుతూ ఒకటి, రెండు నెలలు సక్రమంగా చెల్లించి ఆ తర్వాత బోర్డ్ తిప్పేస్తున్న వెబ్ సైట్లు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఈ తరహా ఘటనల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతుంది.
 
బెట్టింగ్ యాప్స్ మోసాలు : బెట్టింగ్ యాప్స్ లో సరైన విధంగా ప్రెడిక్ట్ చేస్తే లక్షలు, కోట్లు సంపాదించవచ్చని ప్రముఖ యూట్యూబర్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించే వాళ్లు 100 మందిలో కేవలం 5 మంది మాత్రమే కాగా డబ్బులు సంపాదించిన వాళ్ల అకౌంట్లలో డబ్బులు సైతం తర్వాత రోజుల్లో ఫ్రీజ్ అవుతున్నాయి. ఆ డబ్బులు సైబర్ మోసాలకు సంబంధించిన మనీ అని చెబుతూ అమాయకులను ఈ తరహా ఘటనల్లో ఇరికిస్తున్న సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.
 
లోన్ యాప్స్ మోసాలు : భారతదేశంలో లోన్ యాప్స్ బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 10,000 రూపాయలు అప్పు ఇచ్చి రెండు రెట్లు, మూడు రెట్లు వసూలు చేసిన కంపెనీలు కోకొల్లలు. ఆర్బీఐ ఎన్ని యాప్స్ ను బ్యాన్ చేస్తున్నా పేర్లు మార్చుకుని ఆ యాప్స్ తెరపైకి వస్తున్నాయి. సకాలంలో లోన్ చెల్లించకపోతే న్యూడ్ పిక్స్ పంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ ఈ యాప్స్ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: