
తనకు న్యాయం జరగాలి అంటే వెంటనే కిరణ్ రాయాలని అరెస్టు చేయాలని తన పైన చీటింగ్ కేసు మాత్రమే పెట్టారు. కానీ అతడు తనని బెదిరించి చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు అంటూ ఆమె పలు రకాల సెక్షన్ మీద కిరణ్ రాయల్ పైన కేసు వేయడమే కాకుండా ఇలాంటి దుర్మార్గుడికి శిక్ష వేయాలి అంటూ ఆమె మాట్లాడింది. తాను ఆర్థిక ఇబ్బందులలో ఉన్నానని దయచేసి తన డబ్బును తిరిగి ఇప్పించాలని తన పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తానని కాళ్ళ వెళ్ళ పడినా కూడా కిరణ్ రాయల్ వినలేదని తెలిపింది.
తనను చంపేసి జైలుకు వెళ్ళిపోతాను అంటూ ఆమెను బెదిరించారని తనకు పోలీసులు అంటే భయం లేదు.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ భయపెడుతున్నారంటూ ఆ మహిళ లక్ష్మి వెల్లడించింది. తనని ఎన్నోసార్లు అవమానించాడు.. ఇదంతా నాదెండ్ల మనోహర్ అండతోనే చేస్తున్నారని.. లక్ష్మీ భర్త మరణించగానే తనని మాయమాటలతో నమ్మించి లోబరుచుకొని బలవంతంగా తనని అనుభవించి కోరికలు తీర్చుకున్నారంటూ ఆమె ఆడియో వీడియోలతో సహా తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. కానీ బ్యాంకు లావాదేవీలను కూడా అన్నీ కూడా కిరణ్ రాయల్ స్వాధీనంలోనే ఉన్నాయని వాటిని నిలిపివేయాలని బ్యాంకు వారిని కోరుతున్నానంటూ వెల్లడించింది లక్ష్మి. మరి వీటి పైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.