
మనీ డిపాజిట్ స్కామ్స్ : ఈ మధ్య కాలంలో మోసగాళ్లు డబ్బు అకౌంట్లలో డిపాజిట్ చేసినట్టు మెసేజెస్ పంపుతూ యూపీఐ యాప్స్ లో లాగిన్ అయిన తర్వాత ఆ డబ్బులను కొట్టేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. మనీ డిపాజిట్ అయినట్టు మెసేజ్ వచ్చినా కొన్ని గంటల పాటు యుపీఐ ఖాతాలలో లాగిన్ కాకుండా ఉంటే మంచిది.
హనీ ట్రాప్ మోసాలు : అమ్మాయిలు తమ అందాలను ఎరగా వేస్తూ డబ్బున్న వాళ్లను టార్గెట్ చేస్తూ చేస్తున్న మోసాల సంఖ్య కూడా తక్కువేం కాదు. చాలా డబ్బులు సంపాదించి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వాళ్లు ఈ తరహా ఘటనల్లో బాధితులు అవుతున్నారు.
దొంగ నోట్ల స్కామ్స్ : ఈ స్కామ్స్ రెండు విధాలుగా జరుగుతున్నాయి. చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రద్దవుతున్నాయని తమకు 3.5 లక్షల రూపాయల విలువ గల చిన్న నోట్లు ఇస్తే 5 లక్షల రూపాయల విలువ గల పెద్ద నోట్లు ఇస్తామని తమ దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉందని చెబుతూ ఆన్ లైన్ కాల్స్ తో మోసాలు చేస్తున్నారు.
గోల్డ్ ఫ్రాడ్స్ : తమకు గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం దొరికిందని ఆ బంగారం అమ్మే పరిస్థితులు లేవని 10 గ్రాములు 30,000 40 వేల రూపాయలకే ఇస్తామని చెబుతూ బంగారంపై ఆశ పెంచి స్కామర్స్ అన్ని వర్గాల ప్రజలను చీట్ చేస్తున్నారు.
సెకండ్ హ్యాండ్ ప్రాడక్ట్ ప్రాడ్స్ : ప్రముఖ వెబ్ సైట్లలో ఖరీదైన సెకండ్ హ్యాండ్ వస్తువులను తక్కువ ధరకే ఆఫర్ చేస్తూ నిత్యం ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఓలెక్స్ వేదికగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నకిలీ ఉత్పత్తులను ఆఫర్ చేస్తూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు.
1 రుపీ స్కామ్స్ : ఆన్ లైన్ కాల్స్ లో మాట్లాడేవాళ్లు తాము మొదట ఒక రూపాయి రెండు రూపాయలు పంపుతామని ఆ డబ్బులు వస్తే మిగతా డబ్బులు పంపుతామని చెబుతూ అవతలి వ్యక్తులు సెండ్ ఆప్షన్ ద్వారా తమకే డబ్బులు పంపేలా కూడా మోసాలు జరుగుతున్నాయి.