
సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా ఉండాలంటే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చిన సమయంలో ఆ కాల్స్ స్పామ్ కాల్స్ అయితే ఆ కాల్స్ ను లిఫ్ట్ చేయకుండా ఉంటే మంచిది.
ఎవరైనా ఓటీపీ కాల్ ద్వారా అడిగితే ఆ సమయంలో ఓటీపీ నంబర్ తప్పుగా చెప్పడం లేదా కాల్ కట్ చేయడం బెటర్ అని చెప్పవచ్చు.
బ్యాంకు మేనేజర్ అని పోలీస్ ఆఫీసర్ అని ఎవరైనా కాల్ చేస్తే డైరెక్ట్ గా కలిసి సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పడం ద్వారా మోసగాళ్ల చేతికి చిక్కే ఛాన్స్ ఉండదు.
థర్డ్ పార్టీ యాప్స్, సరైన సెక్యూరిటీ లేని వెబ్ సైట్స్, పైరసీ వెబ్ సైట్లు, అశ్లీలతతో కూడిన వెబ్ సైట్లకు దూరంగా ఉండటం ద్వారా ఫోన్, ల్యాప్ టాప్, ఇతర డివైజ్ లలో ఉన్న సమాచారం సేఫ్ గా ఉంటుంది.
షాపింగ్ మాల్స్, ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్, పాన్ నంబర్, ఫోన్ నంబర్ లాంటి కీలకమైన సమాచారాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
ఆధార్ బయోమెట్రిక్స్ తో సైతం మోసాలు జరుగుతున్న నేపథ్యంలో లావాదేవీలు జరపని సమయంలో ఆధార్ నంబర్ ను లాక్ చేసుకోవాలి.
ఆన్ లైన్ ద్వారా పరిచయం అయ్యే గుర్తు తెలియని అమ్మాయిల వల్ల, అబ్బాయిల వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డేటింగ్, ఇతర సోషల్ మీడియా యాప్స్ లో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలకు దూరంగా ఉండాలి.
ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేయడం, కొత్త వెబ్ సైట్లకు సంబంధించి రివ్యూలను, డొమైన్ ఏజ్ ను పరిశీలించడం ద్వారా కొన్ని మోసాలకు చెక్ పెట్టవచ్చు.
పాత నాణేలు, నోట్లకు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వస్తాయని, తక్కువ ధరకే ఫోన్లు, బంగారం ఇస్తామని చెబితే మోసం జరిగే అవకాశాలు ఎక్కువని గ్రహించాలి.
తెలిసిన వ్యక్తుల పేర్లతో ఎవరైనా డబ్బులు అడిగితే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం ద్వారా కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.