ఈ మధ్య కాలంలో బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఆధారంగా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాల వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ మోసాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
 
సిమ్ డీ యాక్టివేట్ అయితే కస్టమర్ కేర్ నంబర్ ను వెంటనే సంప్రదించడం ద్వారా స్కామ్స్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
 
ఏదైనా కారణం వల్ల మోసపోయి అకౌంట్ లో డబ్బులు కట్ అయితే వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించడం, సైబర్ అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు.
 
బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లలో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు.
 
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పాస్ వర్డ్ లను ఛేంజ్ చేయడంతో పాటు అల్ఫా న్యూమరిక్ లెటర్లతో కూడిన పాస్ వర్డ్ లను ఉపయోగించాలి.
 
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డును పోగొట్టుకుంటే కార్డును వెంటనే బ్లాక్ చేయించడం ద్వారా కార్డ్స్ మిస్ యూజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
 
వాట్జ్సాప్ లో గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వచ్చే మెసేజ్ లకు, పరిచయం లేని వ్యక్తుల గ్రూప్స్ కు, బెట్టింగ్ యాప్స్, మనీ రిలేటెడ్ గేమింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలి.
 
కస్టమ్స్ ఆఫీసర్లు అంటూ, డేటా ఎంట్రీ జాబ్స్ అంటూ, రిజిస్ట్రేషన్ ఫీజులు అంటూ వచ్చే కాల్స్ ను ఫేక్ కాల్స్ అని గ్రహించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోరుకునే వాళ్లు ఫేక్ క్లాసిఫైడ్స్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి.
 
అధిక వడ్డీకి ఆశ పడటం వల్ల అసలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఈ తరహా సమస్యలు ఎదురైన సమయంలో పెట్టుబడుల విషయంలో పొరపాట్లు చేయకూడదు.
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: