తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా...hydra పేరు తో హైదరాబాద్ మహానగరంలో చాలా కట్టడాలను కూల్చివేసింది రేవంత్ రెడ్డి. అక్రమంగా నిర్మించిన ఇండ్ల ను కూడా ధ్వంసం చేసింది. అయితే తాజాగా... హోటల్స్ పై పడిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న తాజ్ బంజారా హోటల్  ను మూసి వేసింది సర్కార్.

 రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్... కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోటల్  ను సీజ్ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సరైన సమయంలో, ఆస్తి పన్ను చెల్లించ లేదన్న కారణంతో... సీజ్ వేసింది  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

 దాదాపు రెండు సంవత్సరాలుగా.. సరిగ్గా తాజ్ బంజారా హోటల్ ఆస్తి పన్ను కట్టడం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు సంవత్సరాలలో...1.43 కోట్ల బకాయిలు... చెల్లించలేదట తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు... గతంలో నోటీసులు కూడా జారీ చేశారట.

 ఎన్నిసార్లు నోటీసులు పంపిన కూడా తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం మాత్రం అస్సలు స్పందించలేదట. కడితే కడతాం లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరించారట. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న జిహెచ్ఎంసి  ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్న సంగతి తెలిసిందే. దీంతో మొండి బకాయిలను వసూలు చేస్తుంది జిహెచ్ఎంసి. ఇందులో భాగంగానే తాజ్ బంజారా హోటల్ పైన పడింది. బకాయిలు చెల్లించే వరకు సీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన తాజ్ బంజారా హోటల్.. మూతపడిపోవడంతో అందరూ షాక్ తింటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: