
గత కొన్ని రోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే ఏపీ లలో... వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటు ఏపీలో విజయవాడ, అటు తెలంగాణలో ఖమ్మం జిల్లా పూర్తిగా వరదకు నష్టపోయాయి. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఆరు నెలలు పూర్తయింది. ఇక తాజాగా... వరద నష్టం కింద రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ అలాగే తెలంగాణకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 608 కోట్లు అందించనుంది. అటు తెలంగాణ రాష్ట్రానికి 231 కోట్లు... అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిధుల విడుదలపై... ఓ నిర్ణయానికి వచ్చారు.
దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాలకు వరద నష్టం ఇచ్చేందుకు ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఐదు రాష్ట్రాలకు గాను... 1554.99 కోట్లు ఆర్థిక సహాయం చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో దాదాపు సగానికి పైగా రెండు తెలుగు రాష్ట్రాలకి వాటా దక్కిందని చెప్పవచ్చు. అటు ఒడిస్సా రాష్ట్రానికి 255 కోట్లు ఇవ్వనుంది. అలాగే త్రిపుర రాష్ట్రానికి 288 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే నాగాలాండ్ రాష్ట్రానికి 170 కోట్లు కేంద్ర సహాయం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ వంతు సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి మోడీ సర్కార్ మంచి మనసు చాటుకుంది.