
తెలంగాణలోకి ఎన్డీఏ రూపంలో మళ్ళీ చంద్రబాబు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. తెలంగాణను రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసిన చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తెలంగాణలోకి రానియకూడదని.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్, బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అన్నట్టు బిఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. బిఆర్ఎస్ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలుకు విశేష ప్రాధాన్యం కల్పించారు. వాస్తవంగా 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టు కట్టడంతో.. కెసిఆర్ కాంగ్రెస్‌ను వదిలేసి.. చంద్రబాబును బూచిగా చూపించారు. దీంతో కేసీర్ గెలుపు ప్లాన్ సులువు అయ్యింది.
చంద్రబాబు మళ్ళీ తెలంగాణలోకి వస్తున్నారని.. మళ్ళీ ఆందోళన పాలన మొదలవుతుందని గట్టిగా చేసిన ప్రచారంతో.. బీఆర్ఎస్ వరుసగా భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ప్రచారం నాడు కెసిఆర్ కు రెండో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు బాగా ఉపకరించింది. మొన్న ఎన్నికలలో ఓటమి తర్వాత కేసీఆర్ వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు మరోసారి చంద్రబాబు ని బూచిగా చూపించబోతున్నారా.. ఆయన తాజా వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలవనున్నాయా.. అంటే అలాగే కనిపిస్తోంది.
అయితే వాస్తవానికి చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం ను పట్టించుకునే పరిస్థితిలో లేరు. తీగల కృష్ణారెడ్డి లాంటి నేతలు తిరిగి తెలుగుదేశంలోకి వస్తామని చెబుతున్నా.. వారికి కండువాలు కపడం లేదు. పైగా.. తెలంగాణలో తెలుగుదేశం గత ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. బీజేపితో కలిసి కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. చివరకు గత ఎన్నికల్లో జనసేన, బీజేపి కలిసి పోటీ చేసిన.. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి ప్రయాణిస్తున్న దాఖలాలు లేవు. మరి ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు.. ఆయన వ్యాఖ్యలు వెనుక మర్మం ఏమిటి అన్నది ఆయనకే తెలియాలి.