కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీకి సైతం నిన్నటి రోజున అర్ధరాత్రి అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను హుటాహుటిగా ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ కడుపు సంబంధించిన సమస్యలతో గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతోందని దీంతో సోనియా గాంధీ ఆసుపత్రికి సైతం తరలించారని అక్కడి వైద్యులు కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నదట.


ప్రత్యేకమైన వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. నిన్నటి రోజున ఒక్కసారిగా సోనియాగాంధీ ఆరోగ్యం క్షీణించిందని ఆ తర్వాతే ఆమెను ఆసుపత్రికి చేర్పించారట. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం ఎలా ఉందని కార్యకర్తలు నేతలు ఆరాతిస్తున్నారు. ఇప్పటికీ  సోనియా గాంధీకి వయసు 78 సంవత్సరాలు. దీంతో కొంతమేరకు వృద్ధాప్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతోందనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిమానులు, నేతలు ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదంటూ తెలుపుతున్నారట వైద్యులు. ప్రస్తుతం సోనియా గాంధీ డాక్టర్ సమీరా నంది సంరక్షణలో సైతం వైద్యం తీసుకుంటూ  ఉన్నారట.


అయితే గత ఏడాది కూడా డిసెంబర్లో కర్ణాటకలోని బెల్గాంలో ప్రత్యేకమైన కమిటీ వేయగా అనారోగ్య సమస్యల వల్ల సోనియాగాంధీ అక్కడికి హాజరు కాలేదట. అలా ఇప్పుడు తేలికపాటి జ్వరంతో  పాటుగా కడుపునొప్పి కూడా రావడంతో పూర్తిగా కోలుకున్న  తర్వాతే  రాజకీయాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారట సోనియాగాంధీ. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన సోనియా గాంధీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో సైతం కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన విషయాల పైన ప్రకటనలు చేయడంతో రాజకీయంగా వేడెక్కించేలా చేసింది. ఈ యేడాది జనవరి 15న కొత్త ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించింది సోనియా గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: