
ఆంధ్రప్రదేశ్లో గత పది రోజుల నుంచి ఎక్కువగా ఎండలు వస్తువు ఉండడంతో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎండలను దృష్టిలో ఉంచుకొని అంతకంటే ముందుగానే ఒంటి పూట బడులను ప్రారంభించేలా కూటమి ప్రభుత్వం భావిస్తుందట. ఈనెల 25వ తేదీ నుంచి ఒంటిపూట బడులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాలు దృష్ట ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలా పాఠశాలలకు సంబంధించి ఒంటి పూట బడులను అమలు చేయాలని విద్యాశాఖ మంత్రితో పాటుగా ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారట. వచ్చే వారంలోగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువబడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పాఠశాలలో కళాశాలలో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒంటిపూట బడులకు సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాలని అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో మరి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. మొత్తానికైతే ఈ విషయం వైరల్ గా మారుతున్నది.