బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తన్ని తరిమేశామేశామని వివాదస్పద వ్యాక్యలు చేశారు జగదీశ్వర్ రెడ్డి. ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణకు నష్టం, ద్రోహం జరిగింది అంటే కారణం ఆ.. నలుగురు.... కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అన్యాయంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాలు ఏపీకి తరలిస్తున్నారన్నారు.

రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు అడుగుపెట్టాడని ఆగ్రహించారు. కానీ కేసీఆర్‌ సీఎం ఉన్నప్పుడు... 10 ఏళ్లు చంద్రబాబు.. తెలంగాణలో అడుగు పెట్టలేదన్నారు. 10 ఏళ్ల పాటు చంద్రబాబును తన్ని తరిమేశామేశామని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారన్నారు.


నాగార్జున సాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదని తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శలు చేశారు.  తెలంగాణ లో తాగునీరు కి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తాగునీరు కోసం వాడాల్సిన నీటిని సాగు కోసం తరలించుకు పోతున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కృష్ణా గోదావరి జలాల్లో వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించుకు పోతుందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి ల నీళ్లు ఏపీ తరలించుకు పోతుంది అని హరీష్ రావు మాట్లాడారన్నారు.  హరీష్ రావు ను విమర్శలు చేయడం మానేసి...చంద్రబాబు ను కేంద్రాన్ని అడగండి అంటూ నిలదీశారు. అవినీతి అని కాంగ్రెస్ మాట్లాడితే నవ్వు వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్, బిజెపి లే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.



మరింత సమాచారం తెలుసుకోండి: