ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ కాదు..అవే ఓరిజినల్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్. మహా కుంభ మేళాలో  ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ స్నానం చేస్తుండగా.. కొన్ని ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అయితే.. ఈ పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలపై  వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్ ట్రోలింగ్‌ చేశారు.


పవన్ కళ్యాణ్ పుష్కరస్నానం ఫోటోలను ఎవరూ మార్ఫింగ్ చేయలేదని తెలిపారు వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్. ఆయన ఒరిజినల్ ఫిజిక్ అదేనని వివరించారు. జనసేన వెబ్ సైట్ లోనే ఆ ఫోటోలు ఉన్నాయని సెటైర్లు పేల్చారు వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్. జగన్ మోహన్‌ రెడ్డి మీద ప్రేమ చూపించిన విజయవాడ చిన్నారి పై ట్రోల్స్ చేయటం దారుణం అంటూ నిప్పులు చెరిగారు.


చిన్న పిల్లల మీద కూడా టీడీపీ సైకోలు పైశాచికత్వం చూపిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించారు.  డిప్యూటీ స్పీకర్ సైతం పసిపిల్లను దారుణంగా ట్రోల్ చేశారని చురకలు అంటించారు వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్. మీ ఇంట్లో పిల్లల మీద కూడా ఇలాగే పోస్టులు పెడతారా అంటూ నిలదీశారు.


మహిళలు సైతం పసిపిల్ల మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.చివరికి ఆ బాలిక తల్లిదండ్రులను కూడా సోషల్ మీడియాలో మార్చేశారని ఫైర్‌ అయ్యారు. యూనివర్సిటీలో ఆడపిల్లల బాత్రూమ్‌ల్లో కెమెరాలు పెడితే ఈ టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఏం చేసిందని నిలదీశారు. డీజీపి, హోంమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్.  ఇది ఇలా ఉండగా... మహా కుంభ మేళాలో  ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ స్నానం చేస్తుండగా.. కొన్ని ఫోటోలు వైరల్‌  అయిన తరుణంలో...మార్ఫింగ్‌ చేసిన వారిపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు.  







మరింత సమాచారం తెలుసుకోండి: