తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు ఏవనే ప్రశ్నకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఈ రెండు పత్రికలు తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ పత్రికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కొన్ని కథనాలు పార్టీని, ప్రభుత్వాన్ని ఒకింత ఇబ్బందులు పెడుతుంటాయి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవాళ్లకు ఎక్కువగా మంత్రులుగా అవకాశం దక్కింది.
 
అయితే తొలిసారి మంత్రి పదవి చేపట్టిన వాళ్లకు ఎల్లో మీడియా ఒక విధంగా చుక్కలు చూపిస్తోంది. ఎల్లో మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా ఏపీ మంత్రులు చర్యలు తీసుకుంటున్న సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఏ మంత్రి అయితే స్పందిస్తారో ఆ మంత్రి శాఖకు సంబంధించి మరికొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తాయని చెప్పవచ్చు.
 
విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా ఎల్లో మీడియా కథనాల ఆధారంగా ఒక ఘటన గురించి స్పందించగా బిల్లులు ఆపేయడం గురించి మరిన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మంత్రులు నిజానిజాలు నిర్ధారించుకోకుండా స్పందిస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మంత్రులు ఎల్లో మీడియా విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.
 
ఏపీ మంత్రులు కథనాలను నమ్మి తప్పటడుగులు వేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మంత్రులకు మంచి పేరు రావాలంటే ఎలాంటి తప్పులు చేయకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. పత్రికలను గుడ్డిగా నమ్మి పొరపాట్లు చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
 
కొన్నిసార్లు పత్రికల్లో తమ స్వార్థం కోసం కూడా కొన్ని కథనాలను ప్రచారంలోకి తెచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తప్పులు చేస్తే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏపీ విద్యుత్ శాఖా మంత్రి ఒకింత జాగ్రత్తగా వ్యవహరించి ఈ తరహా తప్పులు జరగకుండా ఉంటే మంచిది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టే పనులకు మంత్రి దూరంగా ఉండాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: