ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తులో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అయితే ఈ విషయాన్ని అటు ఎంప్లాయిస్ యూనియన్ కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈ విద్యుత్ బస్సులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ కోరారట. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సైతం అవకాశాలు కల్పించాలి అంటూ ఆర్టీసీని లాభాల బాట పట్టేలా చేయాలి అంటూ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రావు, ఆర్టీసీ వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు తదితరులు కోరారట.

ఆర్టీసీని ప్రభుత్వం లోకి విలీనం చేస్తే సాయం పెరుగుతుందని అలాగే జనాభాకి అనుగుణంగా కూడా బస్సులను పెంచితే ప్రజలకు కూడా తగునైన సేవలు అందించడానికి ఆర్టీసీ సిబ్బంది కూడా సిద్ధంగానే ఉందని కోరారట. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల విభజన నాటికి ఆర్టీసీలో 62,000 మంది సిబ్బంది ఉండగా ఇప్పుడు 47 వేల మంది ఉన్నారని.. 8,000 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. అలాగే వీరే కాకుండా అద్దె బస్సు డ్రైవర్లు అండ్ కాల్ డ్రైవర్లు సైతం మరొక 20,000 మంది ఉన్నారని వెల్లడించారు.


విభజన నాటికి ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 20 శాతం ఉన్నప్పటికీ ఇప్పుడు 35 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఆర్టీసీలో అన్ని బస్సులు విద్యుత్ బస్సులుగా ఉండాలని కేంద్ర, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసిందని..అయితే ఇలాంటి బస్సులను ఎంపిక చేయడం యూనియన్ కు వ్యతిరేకం కాదని కానీ ఆర్టీసీలో అద్దె  బస్సులో పర్సంటేజ్ పెరుగుతున్నదని.. వీటి వల్ల ఉద్యోగులు కూడా రోజురోజుకి కుదిస్తూ వస్తున్నారంటూ వెల్లడించారు. ఇప్పటికైనా ఆ ప్రైవేట్ బస్సుల నిర్వహణ లోపంతో సమస్తకు చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని బస్సులలో పనిచేసే సిబ్బంది వల్ల కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారంటూ తెలిపారట. ఇప్పటికే ఆర్టీసీలో విద్యుత్ ప్రైవేట్ బస్సులను నడుపుతూ అలిపిరి డిపోనే ఖాళీ చేయించారని రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మరెక్కడ ఉండకూడదని ఉద్యోగులు కూడా ఆందోళన చేపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: