అమెరికా.. ప్రపంచానికి పెద్దన్న.. కానీ సొంత ఖజానాకే కన్నం వేస్తున్నారంటే నమ్ముతారా, సామాజిక పెన్షన్ల పేరుతో జరుగుతున్న మాయాజాలం చూస్తే దిమ్మతిరగాల్సిందే. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు మన దగ్గరే కాదు, అమెరికాలోనూ ఉన్నాయి. కానీ అక్కడ జరుగుతున్న కుంభకోణం వింటే షాక్ అవ్వాల్సిందే.

డొనాల్డ్ ట్రంప్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లో జరుగుతున్న మోసాలు బయటపెడుతుంటే నోరెళ్లబెట్టాల్సిందే. ఏకంగా 200, 250, 350 ఏళ్ల నుంచి "సర్వీస్" చేస్తున్నారంటూ పెన్షన్లు కొట్టేస్తున్నారు. మనిషి జీవితకాలం వందేళ్లు 350 ఏళ్ల వరకు వారెలా పెన్షన్ తీసుకుంటారు, ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి అని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు.

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ట్రంప్ స్వయంగా లెక్కలు చూపెడుతూ ఒక సంచలన నిజం బయటపెట్టారు. ఒక వ్యక్తి ఏకంగా 360 ఏళ్ల వయసులో సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తీసుకుంటున్నాడట. అమెరికా పుట్టిందే 250 ఏళ్లు.. మరి 360 ఏళ్ల సర్వీస్ ఎలా సాధ్యం ఇది జోక్ కాదు.. అక్షరాలా నిజం అని ట్రంప్ చెబుతున్నారు.

ఎలాన్ మస్క్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) వంటి పెద్ద సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాక అసలు గుట్టు రట్టవుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ స్కామ్‌లో ఎందరెంత మంది దొంగ పెన్షన్లు తీసుకున్నారో లెక్కలు తీస్తే కళ్లు తేలేలా ఉన్నాయి.

సామాజిక పెన్షన్లు అంటే సమాజంలో అండలేని వారికి కనీస భరోసా కల్పించడం కోసం పెట్టినవి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా శతాబ్దాల సర్వీస్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. ఇది నిజంగా అమెరికాకు షాకింగ్ న్యూసే కాదు.. ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసే కుంభకోణం. అమెరికా ఇప్పుడు కళ్లు తెరిచింది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్ల విషయంలో ఎప్పటినుంచో చాలా కఠినంగా పారదర్శకంగా ఉంటున్నారు. దొంగ పెన్షన్లు తీసుకునే వారిని చంద్రబాబు గుర్తించి వారికి పెన్షన్ కట్ చేస్తున్న విషయం తెలిసిందే. మస్క్‌ పుణ్యమా అని ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇలాంటి దొంగల అక్రమాలకు పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: