- ( గోదావ‌రి  - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి ఘోర పరాజ‌యం తర్వాత.. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాలలో ఓడిపోయిన అభ్యర్థులను ఇన్చార్జిలను పరస్పరం మార్చేశారు. ఎన్నికలకు ముందు చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను పరస్పరం కుండమార్పిళ్లు చేసి మరి మార్చేశారు. ఎన్నికలలో ఓటమి తర్వాత చాలామందిని తిరిగి పాత నియోజకవర్గాలకు పంపేశారు. ఈ క్రమంలోనే మరోసారి నియోజకవర్గ జిల్లా స్థాయిలో పార్టీ పదవులు భర్తీకి శ్రీకారం చుట్టిన జగన్ .. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలలో ఇన్చార్జిలను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


ఆచంట నుంచి గత ఎన్నికలలో మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఓడిపోయారు. అలాగే పాల‌కొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పై పోటీ చేసిన గుడాల గోపి కూడా ఓడిపోయారు. ఈ క్రమంలోనే గోపిని పక్కనే ఉన్న ఆచంట నియోజకవర్గానికి మార్చి.. పాలకొల్లుకు మరో వ్యక్తిని ఇన్చార్జిగా నియమించాలన్న ఆలోచనకు జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. పాలకొల్లును కాపు నేతకు ఇవ్వాలని.. శెట్టిబలిజ వర్గానికి చెందిన గుడాల గోపికి శెట్టిబలిజ సామాజిక వ‌ర్గ‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఆచంట బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే గోపిని ఆచంటకు పంపి.. పాలకొల్లుకు కాపు నేతను తెర మీదకు తీసుకు వస్తారని తెలుస్తోంది. అలాగే భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. అక్కడ పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తారు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పేరు తెరమీదకు వచ్చినా.. ప్రస్తుతానికి అయితే చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఆచంట, పాలకొల్లు మూడు నియోజకవర్గాలకు వైసీపీ నుంచి పాత అభ్యర్థుల స్థానంలో కొత్త అభ్యర్థులు రావడం కాయం అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: