వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  అనధికారికంగా కొందరు వైసిపి నేతలు,కార్యకర్తల ఫోన్  నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని ఆరోపణలు చ ఏశారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నంబర్స్ ఇటీవల  కలెక్ట్  చేస్తున్నారని బాంబ్‌ పేల్చారు వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని.  నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదని తెలిపారు. తాజాగా వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడి... టీడీపీ పార్టీ కూటమిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ట్యాప్ చేస్తున్నారనే  టీడీపీ లీడర్స్ నీ కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నానంటూ చురకలు అంటించారు వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని. గ్రామ స్థాయి లీడర్స్ భార్య ఫోన్ నంబర్స్ తో ఏం పని అంటూ నిలదీశారు.  విజయవాడలో అనధికారికంగా చంద్రబాబు బంధువు  ప్రకాష్ అనే ఒక వ్యక్తి సిబ్బందిని నియమించుకుని ఫోన్స్ చేసి వైసిపి నేతలను  బేధిరించాలాని చూస్తున్నారని ఆగ్రహించారు.  విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టీ అనధికారికంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని.


క్రిష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా చేస్తున్నారని... ఆరోపణలు చేశారు. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతానని వార్నింగ్‌ ఇచ్చారు.  జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనలో నేను లేనని క్లారిటీ ఇచ్చారు.  అయినా నాపై కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర చెప్తున్న ..నేను రోడ్ పైనే తిరుగుతా ...నా వెంట్రుక కూడా పీకాలేరని తేల్చి చెప్పారు పేర్ని నాని. అధికార పార్టీ నేతలను సంతృప్తి పర్చేందుకు వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని... 10వ తేదీన సత్వ వర్ధన్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: