ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందని కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. ఒకవేళ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే... అంతు చూస్తామని వైసిపి నేతలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత... భద్రత మొత్తం కుదించి వేశానని.. ఆరోపణలు వస్తున్నాయి.

 ఒక మాజీ ముఖ్యమంత్రి కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని చంద్రబాబు కూటమి ప్రభుత్వం అస్సలు ఇవ్వడం లేదని... జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి బతికి ఉంటే.. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా ప్రమాదమే అని... జగన్మోహన్ రెడ్డిని  టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా... పోలీసులు తక్కువ సంఖ్యలో ఉంటున్నారని గుర్తు చేశారు.

 భద్రత మొత్తం గురించి వేసి... వైయస్ జగన్మోహన్ రెడ్డి పై అటాక్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు వారపునలు వచ్చేస్తున్నారు. వాస్తవంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిబంధనల ప్రకారం 139 మందితో భద్రత కల్పించాలని అంటున్నారు.  కానీ 58 మందితో మాత్రమే భద్రత కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ వాస్తవంగా జగన్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఉంటున్నారట.

 అలాగే జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద అసలు భద్రత సిబ్బంది లేరని చెబుతున్నారు. అందుకే మొన్న అగ్ని ప్రమాదం జరిగిన కూడా ఎవ్వరూ... తొందరగా రియాక్ట్ కాలేదని కూడా వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే వైయస్ జగన్మోహన్ రెడ్డిని... టార్గెట్ చేసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని మండిపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం భద్రత కేటాయించకపోయినా కూడా... తాము మాత్రం... జగన్మోహన్ రెడ్డికి రక్షణ వలయంగా ఉంటామని కార్యకర్తలు అలాగే నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: