ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నెమ్మదిగా పుంజుకుంటోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి తీసుకుంటున్న నిర్ణయాలకు షాకిచ్చే దిశగా వైసీపీ అడుగులు వేస్తుండటం గమనార్హం. చట్టపరంగా కూటమి నేతలను బుక్ చేసే దిశగా వైసీపీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. పేర్ని నాని గుంటూరు మిర్చి యార్డ్ కు వెళ్లకపోయినా ఆయన వెళ్లినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
 
ఈ ప్రచారం విషయంలో పేర్ని నాని ఇప్పటికే వివరణ ఇవ్వడం జరిగింది. తనపై కేసు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ వైసీపీ ఒకింత తెలివిగా అడుగులు వేస్తుండటం గమనార్హం. పేర్ని నాని తన నిరసనను ఇప్పటికే డీజీపీకి తెలియజేయడం జరిగింది.
 
తనపై కేసు నమోదు చేసి మానసిక క్షోభకు కారణమైన పోలీసులపై పేర్ని నాని కోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. వేర్వేరు వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం ద్వారా తమకు అన్యాయం జరిగిందనే అభిప్రాయాన్ని కలిగించడంలో వైసీపీ సక్సెస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో బస్సుపై దాడి జరగడాన్ని ఎంపీ గురుమూర్తి సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.
 
2029 ఎన్నికల్లో తమ పార్టీదే అధికారం అని వైసీపీ బలంగా నమ్ముతోంది. సైలెంట్ గా కూటమిపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే విషయంలో కూటమి సక్సెస్ అయింది. అయితే వైసీపీ ప్రణాళికలకు షాకిచ్చే విధంగా కూటమి ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి. జగన్ సైతం ప్రస్తుతం పార్టీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. పార్టీని వేగంగా అభివృద్ధి చేయడం కోసం ఉన్న ఏ అవకాశాన్ని కూడా జగన్ అస్సలు వదులుకోవడం లేదు. కార్యకర్తలు సైతం వైసీపీకి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




 
 


మరింత సమాచారం తెలుసుకోండి: