సీఎం రేవంత్‌ ను దింపబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి. తాజాగా కర్నూల్‌ లో మీడియాతో మాట్లాడారు ఏపీ బీజేపీ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీ కృష్ణ జలాలను దోపిడీ చేస్తున్నారని టి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణం అంటూ ఆగ్రహించారు. ఏపీ ప్రజలను, రైతులను దోపిడీ దొంగలుగా చెప్పడం దారుణమన్నారు. ఒక సీఎం మాట్లాడడం సహేతుకమైందా....అంటూ నిలదీశారు.


శ్రీశైలం డ్యామ్ నిర్మాణం ఎవరి త్యాగలతో నిర్మించారో , వారికి నీరు వినియోగించుకునే పరిస్థితుల్లో ఉన్నారా...రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీ తన కాళ్ళ మీద నిలబడుతుంది, కేంద్రంతో సఖ్యతతో నిధులు తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ లో ఒక్క స్కీం కూడా అమలు చేసే పరిస్థితి లేదని చురకలు అంటించారు ఏపీ బీజేపీ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి.


ఏపీ, తెలంగాణ మధ్య కావాలనే జలవివాదాలు సృష్టిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బేషరతుగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు ఏపీ బీజేపీ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి.  రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి ధింపుతారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి...అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా...అంటూ ఫైర్‌ అయ్యారు.  దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.


దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతుందన్నారు. ఏపీ లో జగన్ క్యాబినెట్ ఒక్క మంత్రి తప్ప అందరూ ఓడిపోయారని చురకలు అంటించారు. ఇపుడు వివిధ మంత్రిత్వ శాఖలను వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ హయాంలో ఆయా మంత్రులు ఆయా శాఖలను మంచిగా చేసి ఉంటే మంత్రులు ఎందుకు ఓడిపోయారని ఎద్దేవా చేశారు.  మంత్రి సత్యకుమార్, నారా లోకేష్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP