ఆయన తెలంగాణ డిజిపిగా గతంలో పనిచేశారు .. అలాగే అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా ఉన్నారు.. అలాగే అభిలాష బిస్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు .. వీరులో ఆంజనీ కుమార్ అభిలాష బిస్త్ డిజీ ర్యాంకులో ఉండగా .. అభిషేక్ మహంతి ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్నారు . కాగా ఇప్పుడు ఈ ముగ్గురికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిన కేంద్రం హోమ్ శాఖ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది .. అయితే ఇప్పుడు ఈ ఆదేశాల పై ఈ ఐపీఎస్‌లు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉందని కూడా అంటున్నారు .. మూడు నెలల క్రితం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఈ విధంగానే బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం ..
ఇక ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురుకి మరో షాకిచ్చింది .. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయినప్పటి నుంచి వీరు ఇక్కడే ఉన్నారు .. రాష్ట్ర విభజన జరిగినా సమయంలో కూడా ఈ ముగ్గురిని కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కి పంపించింది.. కానీ ఆ నిర్ణయాన్ని ఈ ముగ్గురు సవాల్ చేస్తూ క్యాట్‌ని ఆశ్రయించారు .. అక్కడ వీరి అలాట్మెంట్ కు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ముగ్గురూ తెలంగాణలోనే కొనసాగేందుకు చేయని ప్రయత్నం లేదు. చివరికి ఏపీకి వచ్చేస్తున్నారు.