ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. అందుకే ఎన్నో కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే కుంభమేళాకు వెళ్లి అక్కడ కూడా పుణ్యస్నానం చేసి రావడం జరిగింది.అయితే ఒక్కసారిగా మళ్లీ పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో కనిపించడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.


ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నటువంటి కొన్ని ఫోటోలను జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా నుంచి వైరల్ గా మారుతున్నాయి. హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ గారు పరీక్షలు చేయించుకుంటున్నారని.. స్కానింగ్ తదితర పరీక్షలు కూడా నిర్వహించారని తెలియజేశారు. అయితే రిపోర్టు పరిశీలించిన వైద్యులు కూడా పవన్ కళ్యాణ్ కు పలు రకాల సూచనలు చేశారని మరికొన్ని వైద్య పరీక్షలు చేయవలసి ఉన్నదంటూ వెల్లడించారట. ఈనెల ఆఖరికి గాని మార్చి మొదటి వారంలో కానీ మిగిలిన వైద్య పరీక్షలు అన్నీ కూడా పూర్తి అవుతాయని తెలియజేశారు.


ఈనెల 24 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు అంటూ వెల్లాడించారు. దీంతో మొదట అభిమానులు కంగారుపడిన ఆ తర్వాత కంగారు పడాల్సిన పనేమీ లేదు సాధారణ ఆరోగ్య పరీక్షలు అంటూ తెలియజేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ హాస్పిటల్ కి వెళ్లి ఈ పరీక్షలు చేయించుకోవడంతో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బ్రెడ్ పైన కనిపిస్తూ స్కానింగ్ మిషన్ లో ఉన్న పరీక్షలు కూడా చేయించుకుంటున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా మిగిలిన సినిమా షూటింగ్లను కూడా పూర్తి చేయాలని చూస్తున్నప్పటికీ అనారోగ్య సమస్యల వల్ల వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: