
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తే... కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం కష్టమేనని... పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే ఒకవేళ ఉపఎన్నికలు వస్తే... గులాబీ పార్టీ పదికి పది గెలవడం కూడా కష్టమే. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్.
గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలదు. అయితే ఇది గమనించిన కేసీఆర్... ఉప ఎన్నికల కంటే... మరొక మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బయటికి వెళ్లిన ఎమ్మెల్యేలు 10 మందికి గులాబీ పార్టీలో చేరాలని ఉందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో వాళ్లను మళ్లీ సొంతగూటికి చేర్చుకొని... సీఎం రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలని.. అనుకుంటున్నారట. ఉప ఎన్నికలకు వెళితే అన్ని గెలవడం కష్టమే అని భావించిన కేసీఆర్... స్ట్రాటజీ అప్లై చేసి... రేవంత్ రెడ్డికి జలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.
ఇందులో భాగంగానే... పదిమంది ఎమ్మెల్యేలను ఏప్రిల్ మాసంలో... మళ్లీ తీసుకునేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కండువా కప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అదే ఎమ్మెల్యేలకు మళ్లీ కండువా కప్పాలని కేసీఆర్ అనుకుంటున్నారట. అదే జరిగితే రేవంత్ రెడ్డి పదవికే ముప్పు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. తన కాంగ్రెస్ పార్టీలోనే.. రేవంత్ రెడ్డి ఉద్యోగం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కెసిఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నారట.