
ఇలాంటి నేపథ్యంలోనే.... వైయస్ జగన్మోహన్... రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడంపై యూటర్న్ తీసుకున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతోంది. ఆరోజున ఎమ్మెల్సీ, అలాగే ఎమ్మెల్యేల తో కలిసి అసెంబ్లీ హాల్లో సమావేశం కాబోతున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఇప్పటికే వైసిపి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం... ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. దారుణంగా విఫలమైందని వైసీపీ పార్టీ నిత్యం చెబుతున్న సంగతి తెలిసిందే.
కానీ అసెంబ్లీ వేదికగా ఇవే విషయాలను ప్రశ్నిస్తే... ఏపీ ప్రజలను... ఆకట్టుకోవచ్చు. ఆ దెబ్బకు... వైసిపి పార్టీపై సానుభూతి కూడా పెరుగుతుంది. చంద్రబాబు కూడా ఓడిపోయిన తర్వాత ఎన్ని అవమానాలు జరిగినా అసెంబ్లీకి వచ్చారు. కేవలం నారా భువనేశ్వరుని తిడితేనే ఆయన బయటకు వెళ్లారు. అంతకుముందు నిత్యం అసెంబ్లీకి వచ్చేవారు. వైసీపీ నేతలు అన్న మాటలను పడేవారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీని ఫాలో కావాలని అనుకుంటున్నారట.
ఇందులో భాగంగానే.... వైసిపి పార్టీ నేతలను... అసెంబ్లీకి వెళ్లాలని ఆదేశించారట. అయితే ఎమ్మెల్యేలతో పాటు జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే... కచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎదిరించవచ్చు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి తగినంత సమయం ఇవ్వకపోయినా... బయట నిరసన కూడా తెలుపవచ్చు. కానీ బెంగళూరు వెళ్లి ఏపీలోకి రావడం... జైలుకు వెళ్లి పరామర్శించడం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..