- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఒకప్పుడు సీనియర్ నాయకురాలుగా, మంత్రిగా పరిటాల సునీత చక్రం తిప్పారు. గత మూడు దశాబ్దాలుగా పరిటాల కుటుంబానికి తెలుగుదేశం పార్టీలోనూ.. అనంతపురం జిల్లాలోనూ మంచి హవా ఉంది. ఆ మాటకు వస్తే పరిటాల పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులకు కూడా పూనకాలతో ఊగిపోతారు. పరిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అలాంటిది. 2019 సాధారణ ఎన్నికలలో సునీత పోటీ నుంచి తప్పుకుని.. తన తనయుడు పరిటాల శ్రీరామ్‌కు సీట్‌ ఇప్పించుకున్నారు. అయితే వైసీపీ ప్రభంజనంలో శ్రీరామ్ రాప్తాడులో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బిజెపిలోకి వెళ్లడంతో.. చంద్రబాబు శ్రీరామ్‌కు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ ప‌గ్గాలు అప్పగించారు.


ధర్మవరం నుంచి శ్రీరామ్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే బిజెపితో పొత్తు నేపథ్యంలో చంద్రబాబు అనుహ్యంగా.. కడప జిల్లాకు చెందిన సత్యకుమార్‌కు ధర్మవరం సీటు ఇచ్చారు. అయినా శ్రీరామ్ కష్టపడి సత్య కుమార్‌ని గెలిపించారు. ఇప్పుడు సత్య కుమార్ ఏకంగా మంత్రి అయిపోయారు. సత్యకుమార్ శ్రీరామను పక్కనపెట్టారు. శ్రీరామ్ ధర్మవరంలో కనీసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా.. బిజెపి నాయకులు అడ్డుపడే పరిస్థితి వచ్చేసింది. ధర్మ‌వ‌రంలో చాలామంది వైసీపీ నాయకులు.. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బిజెపిలో చేరిపోతున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో సత్యకుమార్ దూకుడు కనిపిస్తుంది.


ఇది పరిటాల కుటుంబానికి ఇబ్బందిగా మారింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. పరిటాల కుటుంబం నుంచి చాలామంది అనుచరులు దూరమవుతున్నారు. తాజాగా సత్యకుమార్ అనుచరులు టీడీపీ నేతల సైతం బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని.. రెండు పార్టీల మధ్య మంట పుట్టిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలపై శ్రీరామ్ సైతం అసహనంతో ఉన్నారు. ఏది ఏమైనా ధర్మవరంలో తెలుగుదేశం, బిజెపి నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. చంద్రబాబు వీటిని కట్టడి చేయకపోతే నియోజకవర్గంలో తెలుగుదేశంకు ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: