ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతూ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తూ ఉన్నది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన చాలా మంది ప్రజలు అసహనంతో ఉన్నారు.ముఖ్యంగా ఎన్నో పథకాలను అమలు చేయడమే కాకుండా నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా, ఉద్యోగులను ,మహిళలను, సూపర్ సిక్స్ హామీలు అంటూ ఎన్నో రకాలుగా మోసం చేశారనే విధంగా పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు.


ఇలాంటి సమయంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురుచూసే వారికి ఒక న్యూస్ అయితే తెలియజేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను విడుదల చేయబోతున్నదట వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్ తో కూడిన ఒక కొత్త రేషన్ కార్డులను సైతం అందించబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.. ఇటీవలే నెల్లూరు జిల్లాలో మీటింగ్లో భాగంగా మాట్లాడుతూ పాత కార్డులలో మార్పులు చేర్పులకు సైతం అవకాశం అవకాశాలు కల్పిస్తారని తెలియజేశారు. అందుకు సంబంధించి ప్రక్రియ కూడా గ్రామ, వార్డు సచివాలయాలలోనే ఉంటుంది అని వెల్లడించారు.


అలాగే రైతులకు పెండింగ్లో ఉన్నటువంటి హమాలి చార్జీలు, రవాణా చార్జీలను సైతం వచ్చే వారంలోపు విడుదల చేస్తారని తెలియజేశారు. గత ఏడాది జులై ఆగస్టులోనే రేషన్ కార్డులను రిలీజ్ చేస్తారంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన కానీ ఇప్పటికీ ఇంకా ఈ అంశం పైన ఎలాంటి పురోగతి వెల్లడించలేదు. వైసిపి హయాంలో కొత్త రేషన్ కార్డులకు సైతం మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట. ఒకవేళ ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పిస్తే మరికొన్ని లక్షల మందికిపైగా దరఖాస్తులు వస్తాయని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేషన్ కార్డు విషయంలో ఎట్టకేలకు ఈ విషయం చెప్పడంతో కొంతమంది హర్షాన్ని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: