
ఈ నేపథ్యంలోనే కొంత మంది బడా వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేశారు. కోట్లల్లో ఆస్తి పన్ను పెండింగ్ ఉన్న నేపథ్యంలో తాజ్ బంజారా హోటల్కు... నోటీసులు ఇచ్చిన జిహెచ్ఎంసి... తాజాగా సీజ్ కూడా చేసింది. అయితే లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలను కూడా జిహెచ్ఎంసి వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా ఆస్తి పన్ను కట్టలేదని జిహెచ్ఎంసి అధికారులు తేల్చారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను బకాయి 5.5 కోట్లు ఉన్నాయని... జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసి అధికారులు.. వెంటనే దీనిపై స్పందించాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పేరుపైన ఐదు పాయింట్ 50 కోట్లు ఆస్తి పన్ను పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు... సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పేరు పైన ఉందట.
అందుకే ఆమె పేరు పై నోటీసులు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్. అయితే దీనిపై ఇంకా కూడా చంద్రబాబు కుటుంబం స్పందించలేదు. నారా భువనేశ్వరి కాకుండా చాలామంది హైదరాబాదులో ఆసిఫన్ను కట్టలేదు. హైదరాబాదులో ఉన్న అస్ బెస్ట్ ఆస్ సంస్థ 30 కోట్లు పెండింగ్లో ఉంచింది.. ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 100 మందికి రెడ్ నోటీసులు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్. వారం రోజుల్లో దీనిపై సమాధానం ఇవ్వకపోతే కచ్చితంగా ఫీజు చేస్తామని రెడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది.