
ఇకపై ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించబోతున్నాయి. నారా లోకేష్ ఆలోచనలకు ప్రతిరూపంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 164 ఆదర్శ పాఠశాలలు కొలువుదీరనున్నాయి. దరఖాస్తుల పర్వం ప్రారంభం మైంది. ఇక మీ పిల్లల భవితకు బంగారు బాట అని చెప్పొచ్చు.
ఆరో తరగతిలో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంటే మీ పిల్లల భవిష్యత్తును మార్చే ఈ గోల్డెన్ ఛాన్స్ మీ తలుపు తడుతోందని ఒప్పుకోవచ్చు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా దరఖాస్తు ఫీజులను కూడా నిర్ణయించారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేవలం రూ.75 మాత్రమే. అంటే తక్కువ ఖర్చుతోనే మీ పిల్లలు నాణ్యమైన విద్యను అందుకోవచ్చు.
లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే ఈ ఆదర్శ పాఠశాలల్లో సీటు సంపాదించడం అంత సులువు కాదు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాత్రమే ఆదర్శ పాఠశాలలో సీటు దక్కనుంది. అంటే టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఇది ఒక రకంగా మంచి పరీక్షే అని చెప్పాలి.
నారా లోకేష్ ఆదర్శ పాఠశాలలు.. ఇవి కేవలం పాఠశాలలు మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాల భవితను మార్చే విద్యా దేవాలయాలు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.