జనసేన పార్టీ అధినేత 2024 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా యువతను తన వైపు తిప్పుకునేకు ఏవేవో మాటలు చెప్పి ఎలాగోలాగా అధికారంలోకి కూటమిలో భాగంగా చేరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి సంబంధించిన చాలామంది నేతలపైన , కార్యకర్తల పైన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటానంటూ ఎన్నికల సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి పట్టించుకోలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


జనసేన పార్టీలో వీర మహిళలుగా పేరుపొందిన వారిలో కొట్టే కావ్య కూడా ఒకరు.. తనకి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ ఎన్నోసార్లు తెలిపింది. కూటమి ప్రభుత్వం వస్తే తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నదని ఎన్నికల ముందు వెల్లడించింది. కానీ ఇప్పుడు 8 నెలలు అయినా ప్రభుత్వ అధికారులు పాలనలో చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ తనకు న్యాయం జరగలేదని చివరికి అనుకున్నది సాధిస్తాం అనుకుంటున్న సమయంలోనే తనపై చాలా అక్రమ కేసులు కూడా అధికారులు బనాయించి తన జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పడుతున్నారనే విధంగా తెలియజేస్తుంది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా షేర్ చేసింది కావ్య. మధ్యతరగతి కుటుంబానికి ఆడపిల్లకు ఇలాంటి రోజు అవి కూడా తమ ప్రభుత్వంలో వస్తుందనుకో లేదంటూ తెలియజేసింది.

కావ్య తమ ఊరిలో ఒక పొలం వివాదంలో ఈమె మీద కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఈమె మీద అక్రమ కేసులు పెట్టారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయట. ఈ వ్యవహారం జనసేన పార్టి అధిష్టానానికి చేరడంతో పార్టీకి సంబంధించినట్లు అధికారులతో మాట్లాడి కావ్య కి జరిగిన అన్యాయం గురించి పూర్తి నిర్ణయాలను తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మళ్లీ ఒక వీడియోను కూడా తెలియజేసిందట. ఈ విషయం పై కావ్యకు న్యాయం జరుగుతుందని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: