
అయితే ప్రజల అభిలాషలు, ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ అసెంబ్లీకి హాజరవుతున్నారనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. అసెంబ్లీకి ప్రతిపక్ష పాత్రలో వైసీపీ హాజరవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష పాత్ర అయితే దక్కిందని అభిప్రాయాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.
ప్రతిపక్ష హోదా గురించి కూడా జగన్ అసెంబ్లీలో డిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్షం లేని నేపథ్యంలో ఈ డిమాండ్ వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కూటమి మాత్రం ఇందుకు సంబంధించి నో చెప్పే ఛాన్స్ ఉంది. ప్రజల మద్దతు పెరిగేలా జగన్ వ్యూహాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
జగన్ హాజరు అవుతున్న నేపథ్యంలో ఏపీ శాసన సభా సమావేశాలు ఒకింత హాట్ టాపిక్ కానున్నాయి. అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఒకింత సంచలనం అవుతున్న నేపథ్యంలో సమావేశాలలో ఎలాంటి కీలక మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. జగన్ పొలిటికల్ గా తన రేంజ్ అంతకంతకూ పెరిగేలా అడుగులు వేస్తున్నారు. జగన్ సరైన వ్యూహాలతో ముందుకెళ్తే 2029 అసెంబ్లీ ఫలితాలలో సంచలన విజయం సాధించడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అయితే అవసరం లేదు.