
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరో ను ఉద్దేశించి అవమానించాడని అంబటి రాయుడు పైన... ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిన్న దుబాయిలో జరిగిన మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కెమెరాలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించారు. అదే సమయంలో అంబటి రాయుడు అలాగే మరికొంతమంది తెలుగులో కామెంట్రీ ఇస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియానికి వచ్చాడని కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఒక వ్యక్తి అనగా.. దానికి అంబటి రాయుడు హాట్ కామెంట్స్ చేశారు. టీవీల్లో కనిపించాలంటే కచ్చితంగా ఇలాంటి పాక్ మ్యాచ్లకు రావాలని... అందుకే ఇలా వస్తున్నారని సెటైర్ వేశాడు. టీవీలో కనిపించేందుకు మెగాస్టార్ చిరంజీవి... ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చినట్లు... అర్థం వచ్చేలా అంబటి రాయుడు కామెంట్స్ ఉన్నాయని... సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అంతేకాదు టీవీలో కనిపించి పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటున్నారని కూడా అన్నాడు. దీంతో అబ్బటి రాయుడు పై ఫ్యాన్స్ అందరూ ఫైర్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తిని ఇలా మాట్లాడడం దారుణమని... ట్రోలింగ్ చేస్తున్నారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇక అటు చిరంజీవి స్టేడియంకు రావడం వల్లే... విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. అటు ఇదే మ్యాచ్ కు నారా లోకేష్ , సుకుమార్ కూడా వచ్చారు.