
అయితే దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. మొదటి అసెంబ్లీ సమావేశాలకు దూరమైన వైయస్ జగన్మోహన్ రెడ్డి.... ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలకు మాత్రం హాజరు కాబోతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే మండల సభ్యులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరు హాజరు కావాలని... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో.... ఆంధ్రప్రదేశ్ డిప్యూ టీ ముఖ్యమంత్రి, జనసేన పా ర్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నిక ల్లో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్లాస్ కూడా పీకారట.
ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి హాజరు కావాలని... లేకపోతే బాగుండదని హెచ్చరించారట. జగన్మోహన్ రెడ్డి సభ్యులు కూడా అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని కోరారట. గతంలో వైసిపి నేతలు వ్యవహరించినట్లు అసెంబ్లీలో వ్యవహరిస్తే అస్సలు నడవదని... ఆ విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్. వైసిపి ఎమ్మెల్యేలతో మర్యాదగా మాట్లాడాలని... స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పైన... రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు జనాలు కోరుకుంటున్నారని అంటున్నారు.