నిన్నటి రోజున గ్రూపు -2 పరీక్షలు అయితే ప్రశాంతంగా జరిగాయి.. కానీ నిరుద్యోగుల ఆగ్రహం ఆవేదన సైతం ఉద్యమాలు అన్నీ కూడా నిన్నటి నుంచి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి.. వీటీ మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది.. చంద్రబాబు నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్ని వర్గాల ప్రజలను సైతం మోసం చేసేలా అలవాటుగా మార్చుకున్నారనే విధంగా ఫైర్ అయ్యారు. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులను కూడా నిలువునా మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు.



మూడు వారాలుగా గ్రూప్2 అభ్యర్థుల  అభ్యంతరాలను వింటున్నట్టుగా నటించి.. వాటిని పరిగణంలోకి తీసుకొని తగిన న్యాయం చేస్తామంటూ నమ్మబలికి చివరికి వారిని నమ్మి గొంతు కోశారంటూ తెలియజేశారు .అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాపనాలను వింటూ.. వాటికి సంబంధించి తప్పకుండా పరిష్కారం చూపిస్తామంటూ.. పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి మీ కుమారుడైనటువంటి నారా లోకేష్ మోసపూరితమైన ప్రకటనను సైతం చేశారంటూ తెలిపారు. మరొకవైపు తాను చెప్పిన సరే ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా కూడా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్పీ ముందుకు వెళ్తుంది అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ వాయిస్ తో ఒక ఆడియో లీక్ చేస్తూ మరో డ్రామా ప్లే చేశారంటూ ఫైర్ అయ్యారు.



ఇంకొక వైపు ఆందోళన చేస్తున్న వారిపైన పోలీసులతో లాటి ఛార్జ్ చేయించారు. ఇది చాలా అమానుషమంటూ ప్రజల్ని ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే అంటూ వెల్లడించారు.. ఏది ఏమైనా అయోమయం గందరగోళం అస్పష్టత మధ్య పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం అంటూ తెలిపారు.. మా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సి ని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రతి ఏడాది  జనవరిలో కూడా జాబు క్యాలెండర్ అని చెప్పి అసలు వాటి గురించే పట్టించుకోలేదంటూ ఫైర్ అయ్యారు.. వాలంటీలకు 10,000 ఇస్తానని చెప్పి వారిని పక్కనే కూర్చోబెట్టారు.. అలాగే గ్రామ,వార్డు సచివాలయాలలో సిబ్బందిని కుదింపు పేరుట ఇతరుల డిపార్ట్మెంట్ కి సర్దుబాటు చేయడం మోసమే.. నిరుద్యోగ భృతి అని ప్రతినెల 3000 అంటూ మోసం చేశారు.. ఏపీ బేవరైజేషన్ కార్పొరేషన్ లో 18,000 మందిని కూడా తీసేసారని ఫైర్ అయ్యారు. ఫీల్డ్ అసిస్టెంట్లను, ఫైబర్ నెట్ కార్పొరేషన్లను అన్నిటినీ కూడా తొలగించారని వారి జీవితాలను నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇది కూడా మోసమే అంటూ తెలిపారు .కొత్త పిఆర్సి కూడా ఉద్యోగులకు ఇవ్వకపోవడం మరింత మోసమే అంటూ తెలిపారు. ఇవే కాకుండా చాలా మోసాలను చేస్తూ ఉన్నారట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: