
నిన్నటి రోజున రాత్రి ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 3:30 నిమిషాల నుంచి నాలుగు గంటల లోపు సుమారుగా రెండుసార్లు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనను బెదిరిస్తూ ఉన్నారని తన విదేశాల నుంచి వచ్చి మరి కాల్చి చంపుతామంటూ బెదిరించారట. గత కొన్ని నెలలుగా ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి అంటూ రాజాసింగ్ తెలియజేశారు. హిందూ ధర్మం కోసమే తాను ఎంతో కష్టపడ్డానని కానీ తన మీద ఇలాంటి తీవ్రవాద శక్తులు కూడా కుట్రలు పండుతున్నారని తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలంటే కోరుకుంటున్నారు.
అయితే గడిచిన రెండు రోజుల క్రితం మెటా సంస్థ కూడా షాక్ ఇచ్చిందట ఎమ్మెల్యే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సైతం బ్లాక్ చేసినట్లు సమాచారం. ఆయన పేరుతో ఉన్న మరో రెండు ఫేస్బుక్ పేజీలు మూడు అకౌంట్లను కూడా తొలగించారట. ఇటీవలే ఆయన రెచ్చగొట్టే విధంగా కొన్ని పోస్టులు చేశారని వాటి వల్ల బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదు వల్లే ఈ విధంగా చర్యలు తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే ఈయనతో పాటుగా ఈయన కుటుంబ సభ్యులు స్నేహితులు మద్దతుదారుల అకౌంట్లను కూడా బ్లాక్ చేసినట్లు సమాచారం. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కొంతమేరకు వెలుసుబాటు కల్పించడం పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అప్పటినుంచి ఈయనకి ఎక్కువగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.